ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే అమ్మ ప్రేమకు విలువ కట్టలేము అని చెబుతారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ అటు తల్లీ బిడ్డల మధ్య ఉండే పేగుబంధం మాత్రం మాటలకు అందనిది అని అంటూ ఉంటారు. ఇక కేవలం నవమాసాలు మోసి జన్మనివ్వడమే కాదు ఇక తన తుది శ్వాస వరకు కూడా బిడ్డల కోసమే బ్రతుకుతూ ఉంటుంది ఏ తల్లి అయినా. బిడ్డలక సంతోషమే తన సంతోషం గా భావిస్తూ ఉంటుంది. తన కొడుకు ప్రయోజకుడు అయినా పనికి రాని వాడు అయినా ఒకేలా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అందుకే తల్లిని మించిన దైవం లేదు అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం కొంత మంది తొలిప్రేమకే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.


 రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ విషయంలోనే చివరికి మానవ మృగాలుగా మారిపోయి దారుణంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులను దారుణంగా తల్లులే ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఇక్కడ అమ్మతనానికి అవమానం మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటన ఒకటి జరిగింది. ఏకంగా కన్నతల్లే పసిబిడ్డను సజీవంగా భూమిలో పాతిపెట్టింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.


 బస్తీలోని జిల్లా ఆసుపత్రి పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. జిల్లా ఆస్పత్రి సమీపంలో ఓ మహిళకు చిన్నారి ఏడుపు వినిపించింది. ఈ క్రమంలోనే గమనించిన మహిళ అటువైపుగా వెళ్లి చూసింది. ఈ క్రమంలోనే అక్కడ భూమిలో సగం పాతిపెట్టిన శిశువు కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయింది సదరు మహిళ. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిడ్డను బయటకు తీశారు. ఆసుపత్రిలో పిల్లల వార్డు కు తరలించి చికిత్స అందించారు.  పాప ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఇక చిన్నారి తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: