అర్ధరాత్రి సమయంలో ఇక అందరూ ఇంట్లో నిద్రిస్తున్న ఉండగా పెట్రోల్ బాటిల్ ను గదిలోకి విసిరి ఇక నిప్పంటించాడు. ఇక ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మంటల్లో సజీవదహనం అయ్యారు అని చెప్పాలి.. ఇడుక్కి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నా 79 సంవత్సరాల వృద్ధుడు. ఆ వృద్ధుడు తన కొడుకుతో ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. దీంతో ఏకంగా కన్నకొడుకు పైన కక్ష పెంచుకున్నాడు. ఇక ఇటీవలే మరో సారి కొడుకు తో ఆస్తి విషయంలో గొడవ పడిన హామీద్ అందరూ నిద్రపోతున్న సమయంలో ఏకంగా పెట్రోల్ బాటిల్ ను ఇంట్లోకి విసిరి నిప్పంటించాడు.
ఈ క్రమంలోనే నిప్పులు ఆర్పేందుకు నీళ్లు రాకుండా ఉండేందుకు ట్యాప్ కూడా రాకుండా బంద్ చేశాడు. ఇక పక్కాగా ప్లాన్ వేసుకొని చివరికి మర్డర్ కు పాల్పడ్డాడు. అయితే ఏకంగా ఆస్తి విషయంలో కన్న కొడుకుని తండ్రి చంపేయడం గురించి తెలిసి కుటుంబ సభ్యులే కాదు స్థానికులు అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇక పోలీసుల విచారణలో అన్ని నిజాలు హమీద్ బయటపెట్టినట్లు తెలుస్తోంది.