ఎంత దారుణం.. ఎంత అమానుషం.. ఎంత అమానవీయం.. ఎంత ఘోరం.. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇలాంటి పదాలు ఎక్కడ సరిపోవడం లేదు. మానవత్వం ఉన్న మనుషులు చేస్తున్న పాడుపనులు చూస్తూ ఉంటే.. ఎవరికీ మాట పెకల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు ఎన్నో దారుణ ఘటనలు. చివరికి ఆడపిల్లల రక్షణ  అంధకారం లోకి వెళ్లి పోతుంది. ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకు వస్తూనే ఉన్నాయి. కోర్టులు కఠిన శిక్షలు విధిస్తే ఉన్నాయి. అప్పుడప్పుడు పోలీసులు అత్యాచారం చేసిన వారిని ఎన్ కౌంటర్ కూడా చేస్తున్నారు.


 కాని పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడంలేదు. ఆడపిల్లల రక్షణకు మాత్రం భరోసా ఉండడం లేదు.. దీంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టిన ఆడపిల్ల మళ్లీ క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అని ప్రతి ఆడపిల్ల  కంటి మీద కునుకు లేకుండా బ్రతకాల్సిన పరిస్థితి నేటి సమాజంలో నెలకొంది అని చెప్పాలి. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు మానవ మృగాలుగా  మారిపోతున్న మనుషులు చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ సభ్య సమాజం తలదించుకునే ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా పట్టపగలే ఓ మహిళపై 10 మంది కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానికులు అందర్నీ కూడా ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన.


 నెల్లూరు జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక సంఘం మండలంలోని ఓ గ్రామంలో వివాహిత సమీపంలో ఉన్న పొలాల్లో పశువులను మేపేందుకు వెళ్ళింది.  మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అక్కడికి దగ్గర్లో ఉన్న సారా భట్టి దగ్గర సారా తాగిన ఓ యువకుడు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే కాపాడాలి అంటూ ఆమె కేకలు వేసింది. అయితే ఆ సమయంలో పలువురు వ్యక్తులు పశువులు కాస్తూ అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరూ కూడా కామాంధుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ఇక విషయం తెలిసిన కామాంధుడి భార్య వచ్చి అడ్డుకోవడంతో బాధితురాలు ప్రాణాలతో బయట పడింది. గతంలోనూ మరో మహిళపై ఇలాగే లైంగికదాడి జరిగినట్టు తెలుస్తుంది. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: