ఇక ఇలా ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా తమకంటే తక్కువ కులం వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే కారణంతో యువతీ యువకుల తల్లిదండ్రులు కక్షగట్టి మరి ఇక అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద దారుణంగా నరికి చంపిన ఘటన సభ్య సమాజం తీరును చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ యువతి ఓ డ్రైవర్ ను ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇంట్లో ప్రేమ విషయం కూడా చెప్పింది.
ఇక ఇంట్లో పెద్దలు మాత్రం డ్రైవర్ గా పని చేసే వాడిని పెళ్లి చేసుకుంటావా.. ఈ విషయం మా దగ్గరికి వచ్చి చెబుతావా నీకు ఎంత ధైర్యం అంటూ మందలించారు. కానీ ప్రేమను వదిల లేకపోయినా ఆ యువతి ఇక పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. దీంతో కక్షగట్టిన యువతి కుటుంబ సభ్యులు ఇక ఆ యువతి భర్తను వేట కొడవలితో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకట పల్లి లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి..