
ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్బి కాలనీలో వెలుగులోకి వచ్చింది ధర్మారెడ్డి ఎల్ఐజీ గృహాల్లో నివాసముండే రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో వర్క్ ఫ్రం హోం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే బెడ్ రూంలో కూర్చొని పని చేసుకుంటున్నాడు. అదే సమయంలో బట్టలుతికిన అతని భార్య ఇక వాటిని ఆరేసెందుకు మిద్ద పైకి వెళ్ళింది. ఇక అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న లక్ష్మీ అలియాస్ హలీమా బేగం రాజేశ్వర్ రెడ్డి ఇంట్లోకి చొరబడింది. ఇక యజమానులు ఇంట్లో ఉన్నారు అనే భయం బెరుకు లేకుండా ఏకంగా బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను ఇక్కడ చార్జింగ్ పెట్టి ఉన్న ఫోన్ కూడా దొంగలించి అక్కడి నుంచి పరారయ్యింది.
ఇక ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకున్న రాజేశ్వర్రెడ్డి ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో దొంగతనం చేసింది లక్ష్మీ అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఇక నిందితురాలు లక్ష్మి శేర్లింగంపల్లి లో నివాసం ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ పనిచేస్తూ ఉంటుందని పోలీసులు గుర్తించారు.