భార్యాభర్తల బంధం అంటే ప్రేమ, నమ్మకం పై ఉంటుంది. అందుకే చిన్న గొడవలు వచ్చినా అనుమానం వుంటే పెద్ద సమస్యలు ఎదురవుతాయని పెద్దలు అంటారు. అమ్మాయి మీద ఒకసారి అనుమానం కలిగితే దాని పరినామాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు వేరే వ్యక్తి తో అక్రమ సంబంధాన్ని ఉందనె అనుమానం తో భార్యను అతి దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది.


వివరాల్లొకి వెళితే... ఈ దారుణ ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. రైల్వే క్వార్టర్స్‌ లో నివాసముంటున్న రైల్వే గార్డ్‌ బాలాజీనాయక్‌ కుమారుడు సుబ్రహ్మణ్యం నాయక్‌కు కదిరి మండలం నాయనపల్లికి చెందిన అఖిలబాయికి గత ఏడాది నవంబర్‌లో వివాహమైంది.. ట్రిపుల్ ఐటి చదువుతున్న. లక్ష్మి సెలవులు కావడం తో భర్త ఇంటికి వచ్చింది.కాలేజీ రోజుల్లో ఓ యువకుడి తో కలిసి అఖిలబాయి చేసిన టిక్‌ టాక్‌ను చూసి సుబ్రహ్మణ్యం సహించలేకపోయాడు. వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అనుమాన పడేవాడు. దాంతో అతను ప్రతి చిన్న విషయాన్ని గుచ్చి గుచ్చి అడిగేవాడు.


ఇద్దరి మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. రెండు నెలలక్రితం వీరి పంచాయితీ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు సర్దిచెప్పి పంపించారు. ఉగాది పండుగ నేపథ్యం లో అఖిలబాయిని భర్త ఇడుపుల పాయ నుంచి గుంత కళ్ళు లోకి తీసుకు వచ్చారు. ఉదయం అతను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం చూసిన అత్త వెంటనే రూమ్ కు వెళ్ళి చూసింది. అఖిలబాయి రక్తపు మడుగులో పడి ఉంది. గొంతు, చేతి మణికట్లు కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించారు . పొలిసులు ఎంట్రీ ఇవ్వడం తో పూర్తీ విషయాల ను సెకరించె పనిలో నిమగ్నమై వున్నారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: