నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత నేటి సభ్యసమాజంలో బ్రతుకుతున్నది మనుషుlaa లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మృగాల అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు  ఆ మానవత్వాన్ని మరిచి పోతున్నారు  తోటి మనుషుల విషయంలో జాలి దయ చూపించే మనుషులు ఇక ఇప్పుడు ఉన్మాదులు గా మారిపోతున్నారు. ప్రాణాలకు కాస్తయినా విలువ ఇవ్వకుండా దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు. కేవలం పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా ఇక ఇలాంటి దారుణం ఘటనలకు పాల్పడుతున్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టాడని ఆ తల్లి ఎంతో సంబరపడిపోయింది. ఎంతో ప్రేమగా పెంచి పెద్దచేసింది. తన కష్టాలు  మొత్తం తీరిపోతాయి అని అనుకుంది. కానీ ఆ కొడుకే చివరికి తన పాలిట యమకింకరుడిగా మారిపోతాడు అని మాత్రం ఊహించలేక పోయింది ఆ తల్లి. పేగు తెంచుకుని పుట్టిన కొడుకే పెరిగి పెద్దయిన తర్వాత చివరికి దారుణంగా హత్య చేశాడు. మద్యానికి బానిసై చివరికి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని తిరుమంపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.


 గంగేశ్వర్ అనే వ్యక్తి ఇటీవలి కాలంలో మద్యానికి బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలోనే అతని తీరును భరించలేకపోయిన భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పటికీ అతనిలో మార్పు రాలేదు. తరచు తాగి వస్తు ఇక తల్లి అంజమ్మ తో గొడవ పడుతూ ఉండేవాడు. పనీపాటా లేకుండా తిరుగుతూ మద్యానికి డబ్బులు కావాలి అంటూ వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు.  తన భార్యను కాపురానికి తీసుకురావాలంటూ అంజమ్మ పై ఒత్తిడి తీసుకువస్తూ ఉండేవాడు.  ఇటీవల మరోసారి తల్లి అంజమ్మ తో గొడవ పడ్డాడు గంగేశ్వర్. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో రొట్టెల కోలతో తల్లి అంజమ్మ చెవి భాగంలో గట్టిగా కొట్టాడు.  56 అంజమ్మా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: