
కానీ ఇటీవలే ఒక వ్యక్తి మద్యం మత్తులో బయటపెట్టిన నిజం మాత్రం నిందితులను పట్టించే సింది. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు లో శ్రీ హర్ష అనే 17 ఏళ్ల యువకుడు 2018 లో వేలివెన్ను లోని ఓ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. అదే ఏడాది దీపావళి పండక్కి తాతయ్య ఇంటికి వెళ్ళాడు. ఇక అంతకు ముందు నుంచే క్రికెట్ లో స్నేహితులైన నిర్మాణ కూలీలు షేక్ రషీద్,ఆదిత్య, మునీంద్రుల తో కలిసి నిడదవోలు జూనియర్ కళాశాలకు ఆడుకునేందుకు వెళ్ళాడు శ్రీ హర్ష. క్రికెట్ ఆడుతున్న సమయంలోనే వీరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ప్లాన్ ప్రకారం ముగ్గురు నిర్మాణ కార్మికులు కూడా శ్రీ హర్ష మెడకు తాడు బిగించి దారుణంగా హత్య చేశారు. ఇక ఆ తర్వాత మృతదేహాన్ని రైల్వే గేటు కాలువలో పడేశారు.
2018 లోనే తన కొడుకు కనిపించడం లేదంటూ శ్రీ హర్ష తండ్రి రత్నకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అప్పటినుంచి ఆ కేసు ఛేదించేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా నాలుగేళ్ల నుంచి మిస్టరీ గా ఉన్న మర్డర్ కేసులో ఇటీవల నిజం బయటపడింది. తాగిన మైకంలో రషీద్ తన తో జాగ్రత్తగా ఉండాలని తాను ఓ హత్య చేసినట్లు మిత్రులను హెచ్చరించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో రషీద్ అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. ప్రస్తుతం రషీద్ పోలీసుల అదుపులో ఉండగా ఆదిత్య మునీంద్రులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.