ఇది సర్వసాధారణం.. కాని కొన్ని కొన్ని సార్లు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఏకంగా ఒక అమ్మాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లాంటి ఘటన లు కూడా సోషల్ మీడియాలో కి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పటివరకు ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. అయితే ఈ సారి అమ్మాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కాదు.. ఏకంగా ఒక అబ్బాయిని మరోఅబ్బాయిని పెళ్లి చేసుకున్న ఘటన సంచలనం గా మారిపోయింది. స్థానికులను కూడా అవాక్కయ్యేలా చేసింది. ఇది జరిగింది ఎక్కడో కాదు మెదక్ జిల్లాలోనే.
ఇలా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జోగిపేట కు చెందిన 21 ఏళ్ల యువకుడు చిలప్ చెడ్ మండలంలోని చండూరు గ్రామానికి చెందిన మరో 22 ఏళ్ల యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జోగిపేట జోగినాథ్ ఆలయంలో ఇద్దరు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇక ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేము అంటూ చెబుతున్నారు ఇద్దరు. అయితే ఈ ఘటన తల్లిదండ్రులకు తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాదు ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం..