అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదు అన్న విషయం తెలిసి ఆ తల్లి గుండె పగిలిపోయింది. తన కూతురు చనిపోవడానికి కారణం ఒక యువకుడు అని తెలిసి తల్లి గుండె రగిలిపోయింది. తన కూతురు చావుకు కారణమైన యువకుడు కూడా ప్రాణాలతో ఉండకూడదు అనే కోపంతో రగిలిపోయింది ఆ తల్లి.  హత్య చేయడం తప్పు అని తెలిసినప్పటికీ కూతురి మరణం మాత్రం అతని కళ్ళముందు తేలియాడుతూ ఉండడంతో చివరికి తన కూతురు చనిపోవడానికి కారణమైన యువకుడిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


 బీబీనగర్ మండలం రామారావు పేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. మేడ్చల్ పరిధిలోని డీజే ఆర్ కాలనీలో నివసిస్తున్నా రాము అనే 35 ఏళ్ల వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి ఇదే కాలనీలో ఉంటున్న  వెంకట లక్ష్మి కుటుంబంతో గొడవలు ఉన్నాయ్.అయితే చీర వెంకట లక్ష్మి కూతురు భార్గవినీ కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు రాము. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఇదే విషయంపై గొడవలు జరుగుతున్నాయి. వేధింపులు ఎక్కువవడంతో భార్గవి ఇటీవల బలవన్మరణానికి పాల్పడింది. అయితే భార్గవి ఆత్మహత్యకు రాము వేధింపులే కారణమని వెంకటలక్ష్మి ఆమె కుమారుడు రాము పై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో అతని హతమార్చాలని అనుకున్నారు.


 ఇటీవలే మేడ్చల్ పరిధిలో అతని దారుణంగా హత్య చేసి ఆటోలో మృతదేహాన్ని తీసుకు వెళ్లి బీబీనగర్ మండలం రామారావు పేట శివారులో పెట్రోల్ పోసి కాల్చి వేసారు. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. వారు చెప్పిన సమాచారం మేరకు రామారావు పేట శివారులో రాము మృత దేహాన్ని గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసిపీ పరిస్థితులను పరిశీలించారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరికి తరలించగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: