డబ్బు ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది అని చెబుతూ ఉంటారు. డబ్బు ఒక్కటే జీవితం కాదు  డబ్బు వెంట పరుగులు పెడితే అన్ని కోల్పోతామని మరికొంత మంది అంటూ ఉంటారు. కానీ డబ్బు ఉంటే మనిషి ప్రాణాలను నిలబెట్టవచ్చు అని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఆర్థిక సమస్యల కారణంగా మనస్థాపంతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతను మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.


తర్వాత అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో వైద్యులు శాయశక్తులా ప్రయత్నించి అతని ప్రాణాలు నిలబెట్టారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్ కావడంతో 60వేల వరకు బిల్లు అయింది. చెల్లించాలంటూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కోరారు.  కానీ ఆర్థిక సమస్యల కారణంగా బిల్లులు చెల్లించలేక పోయినా  సదరు వ్యక్తి మనస్తాపం చెంది ఇక అదే ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 2006లో  కెటిపిపి నిర్మాణంలో భూపాలపల్లి మండలం మెహబూబ్ నగర్ కి చెందిన మర్రి బాపు అనే 46 ఏళ్ల వ్యక్తి రెండు ఎకరాల భూమిని కోల్పోయాడు.


 అయితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని అంటూ చెప్పి జెన్ కో కంపెనీ ఆశ పెట్టడంతో ఇక రెండు ఎకరాల భూమిని కోల్పోయినప్పటికీ రేగొండ మండలం పొన్నెకల్లు కు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నాడూ. వీలు దొరికినప్పుడల్లా కేటీపీపీ అధికారుల వద్దకు వెళ్లి తన కొడుకుకి ఉద్యోగం ఇవ్వాలంటూ మొరపెట్టుకున్నాడూ. ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో చివరికి కేటీపీపి ముఖద్వారం వద్ద పురుగుల మందు తాగాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే భూపాలపల్లి ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుని కోరుకున్నాడు. కానీ 60000 బిల్లులు చెల్లించాలని ఆసుపత్రి నిర్వాహకులు కోరిన కేటీపి పి సిబ్బందిని అధికారులు  స్పందించలేదు. మర్రిబాపు కుటుంబ సభ్యుల పై ఒత్తిడి తీసుకురావడంతో ఇక వాళ్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు దీంతో మనస్థాపం చెందిన అతను ఆస్పత్రిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: