అడవుల్లో బ్రతికే మృగాలతో పోల్చి చూస్తే మనుషులకు ఆలోచన శక్తి ఉంది.. ఏది మంచి ఏది చెడు అని ఆలోచిస్తూ విచక్షణగా ప్రవర్తించే తెలివితేటలు ఉన్నాయి. ఇక నేటి నాగరిక సమాజంలో మనిషి ఆలోచనా తీరు మరింత పరిపక్వత చెందుతుంది. మాటలలు  కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఇదంతా ఉంటుంది తప్ప నిజ జీవితంలో మనుషులు ఎవరూ కూడా మనిషిలాగ ఆలోచించడం లేదు. ఎందుకంటే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు కాస్త అడవుల్లో ఉండే క్రూర మృగాల కంటే దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 ఇలా రోజు రోజుకి మనుషులు ఏకంగా మానవ మృగాలుగా మారిపోతున్న తీరు చూస్తూ ఉంటే సభ్య సమాజం తీరు ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కాస్తయినా వెనకడుగు వేయడం లేదు మనుషులు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి గొంతు కోసిన యువకుడు పరారయ్యాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని సత్తెనపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు యువతి గొంతు కోసాడు యువకుడు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు.


 ఇంతకీ ఏం జరిగిందంటే ఫాతిమా అనే యువతి భర్తతో విడిపోయి సత్తెనపల్లిలో ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే గురజాలకు చెందిన తులసిరామ్ తో ఆమెకు పరిచయం ఏర్పడగా.. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో అతనితో కలిసి ఉంటూ సహజీవనం చేయడం మొదలు పెట్టింది ఫాతిమా. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలి అంటూ ఓ రోజు అతని కోరింది. కానీ అతను మాత్రం పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. కోపంలో విచక్షణ కోల్పోయినా తులసీరామ్ చివరికి ఫాతిమా గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: