సభ్య సమాజంలో ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ గౌరవంగా బతకడం కంటే అక్రమాలకు పాల్పడి ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సాలు చేయడమే బెటర్ అని అనుకుంటున్నారు నేటి రోజుల్లో జనాలు.  ఇది ఎవరో చెబుతున్నది కాదు తరచూ వెలుగులోకి వస్తున్న ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో డ్రగ్స్ గంజాయి స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు.  సినిమాల ప్రభావం కారణంగా సరికొత్తగా ఆలోచిస్తూ ఏకంగా పోలీసులకు సవాల్ విసురుతున్నారు నేటి రోజుల్లో అక్రమార్కులు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వినూత్నమైన దారులను వెతుకుతూ వుండడం గమనార్హం.


 ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్పా సినిమా చూసిన తర్వాత ఇక అచ్చం అలాగే గంజాయి స్మగ్లింగ్ చేయడం బెటర్ అని భావిస్తూ ఇక పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే అక్రమ సంపాదనకు అలవాటు పడిన గంజాయి స్మగ్లర్లు సరికొత్త రీతిలో గంజాయిని తరలిస్తున్న సమయంలో  తనిఖీలు చేసిన పోలీసులు చివరికి గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రాయపర్తి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎస్సై బండారు రాజు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేయడం మొదలుపెట్టారు.



 అయితే వరంగల్ వైపు కారులో వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి జిల్లా గోలు గొండకు చెందిన పోలిరెడ్డి గంగరాజు, నర్సీపట్నం మండలం చెందిన నానాజీ లను వాహనాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో కాస్త అనుమానం గా కనిపించారు. ఈ క్రమంలోనే కారులో తనిఖీ చేయగా ఏకంగా 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో మరో సంచలన నిజం కూడా బయటపెట్టారు.


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్న మరో వాహనంలో కూడా గంజాయి ఉంది అనే విషయాన్ని పోలీసు విచారణలో బయట పెట్టారు ఆ ఇద్దరు నిందితులు. అయితే అప్పటికే తాము దొరికిపోయినట్లు లారీ డ్రైవర్ క్లీనర్ కి సమాచారం అందించారు ఇద్దరు నిందితులు. దీంతో ఇక తనిఖీలు చేస్తున్న ప్రాంతంలో వంద మీటర్ల దూరంలో వాహనాన్ని వదిలి పారిపోయారు నిందితులు. ఇక లారీని తనిఖీ చేయగా 480 కిలోల గంజాయి లభించింది. అయితే నిందితులు లారీ ట్రక్కు కింద భాగంలో సుమారు 500 కిలోల గంజాయిని రవాణా చేసేందుకు అనువుగా ఒక అర నిర్మించి ఇక అందులో గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించారు అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: