
ఇక ఫస్ట్ నైట్ రోజు ఆనందానికి అవధులు కూడా ఉండవు అని చెప్పాలి. సాధారణంగా ప్రతి ఒక్క యువకుడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందో అని భయపడి చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది. మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు కు చెందిన సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులకు కిరణ్ కుమార్ అనే 32 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. కాగా ఈ నెల 11వ తేదీన ఇతనికి ఏం జరిగింది. ఈ క్రమంలోనే 16వ తేదీన మొదటి రాత్రి ఏర్పాటు చేశాడూ.
ఈ క్రమంలోనే ఇటీవల గుంటూరు బస్టాండ్ లో నాలుగు గంటల సమయంలో దిగిన కిరణ్ కుమార్ ఇప్పుడే వస్తాను అంటూ చెప్పి వెళ్ళాడు. ఇక ఆ తర్వాత అతను ఎంతకీ రాకపోవడంతో సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే అతని గురించి ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. తర్వాత రోజు కృష్ణా నది ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. మృతుడి జేబులో ఉన్న సెల్ ఫోన్లో సిమ్ తీసి పరిశీలించి బంధువులకు సమాచారం అందించారు. తల్లి విజయలక్ష్మి తాడేపల్లి పోలీస్ స్టేషన్ చేరుకొని చనిపోయింది తన కొడుకు అని నిర్ణయించుకుంది. ఫస్ట్ నైట్ అంటే భయపడ్డాడని.. స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. కట్టుకున్న దాన్ని మమ్మల్ని అన్యాయం చేశాడంటూ తల్లి బోరున విలపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..