ఆమెకు ఆశీర్వాదం ఇస్తానని చెప్పి తల పై బలంగా ఇనుప రాడ్డు తో కొట్టి హత్య చేశాడు.. ఆ తర్వాత శవాన్ని మాయం చేశాడు.. ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి పుటేజ్ ను పరిసిలించి ఆమె గుడి లోనే మాయం అయ్యిందని భావించి పూజారిని తమ స్తైల్లొ విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇలా చెసానని చెప్పడంతో అందరు షాక్ అయ్యారు..
వివరాల్లొకి వెళితే.. మల్కాజిగిరి ఠాణా పరిధిలోని విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ కాలనీలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు..నగలపై ఆశతో ఆలయ అర్చకుడే ఈ దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు.. నగలను కొన్న వ్యాపారిని కూడా పోలీసులు అదుపులో కి తీసుకొని విచారించారు.ఆమె కోసం గాలిస్తున్న పోలీసుల కు గురువారం ఉదయం కాలనీ సమీపంలోని దేవాలయం వెనుక మృతదేహం కనిపించింది. ఒంటిపై నగలు లేకపోవడం తో ఆభరణా ల కోసమే హత్య చేసినట్టుగా పోలీసులు భావించి ఆ కోణం లో దర్యాప్తు ప్రారంభించారు.. ఆమెను హత్య చేసి గుడిని శుభ్రం చేశాడని తెలుసుకున్నారు.నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.