పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి.. సెంచరీ కొట్టిందని సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా బాదుడు ఆపడం లేదు. ఈ క్రమంలోనే పెరిగిపోతున్న పెట్రోల్ ధర ప్రస్తుతం ఒక లీటర్ కు 120 రూపాయలకు పైగానే పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో వాహనం బయటకు తీయాలి అంటేనే భయపడిపోతున్నారు సామాన్య ప్రజలు.  అత్యవసరం అయితే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు. ఇక ఇలా పెట్రోల్ ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ఎంతో మంది ఎలక్ట్రికల్ వాహనాలు వైపు మొగ్గు చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 కాగా ఇప్పటికే ఎంతోమంది ఎలక్ట్రికల్ బైక్లను కొనుగోలు చేశారు. కానీ ఇటీవలి కాలంలో ఎలక్ట్రికల్ వాహనాలు వేగంగా పేలిపోయి కాలిపోతూ ఉండడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇక ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేయడానికి భయపడిపోతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎలక్ట్రికల్ బైక్ లు పేలిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని సంఘటనల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మరో ఎలక్ట్రికల్ బైక్ పేలింది.


 దీంతో ఒక ప్రాణం కూడా పోయింది. విజయవాడలోని గులాబీ తోట లో ఎలక్ట్రికల్ బైక్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ ఘటనలో 40% గాయాలపాలైన అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది అన్నది తెలుస్తుంది. మహిళ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇలా పేలుడు సంభవించిన ఎలక్ట్రికల్ బైక్ పైన ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. వారికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి అని తెలుస్తోంది. అయితే ఎలక్ట్రికల్ బైక్ లు కొనుక్కుంటే పెట్రోల్ బాదుడు  తప్పుతుందని అనుకుంటున్న వారూ ఇక ఇప్పుడు వరుసగా ఎలక్ట్రికల్ బైక్ లు పేలిపోతూ ఉండడం చూసి భయాందోళనలో మునిగిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: