అంకిరెడ్డిపల్లె కు చెందిన రసూల్ బి భర్త కుమార్తెతో కలిసి గ్రామంలో ఉంటుంది. కాగా ఇటీవలే సదరు మహిళ తో పాటు కొంతమంది బంధువులు 22వ తేదీన తుమ్మలపెంట సమీపంలో ఉన్న సుంకులమ్మ గుడి వద్ద పూజలు చేసేందుకు వెళ్లారు. ఇక ఆ తర్వాత రామేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నీటిగుండం లో దిగారు. ఇక అంతా సవ్యంగా సాగుతుంది. ఒక్కసారిగా కేకలు వినిపించాయి. దీంతో రసూల్ బి గుండంలో గల్లంతయింది అంటూ ఆమె కుమార్తే తో పాటు కొంతమంది మహిళలు కేకలు వేశారు. దీంతో అక్కడున్న వారందరూ కూడా సదరు మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక రాత్రంతా అక్కడే ఉండి గాలించినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. తర్వాత గుండంలో ఉన్న నీటిని మొత్తం బయటకి తోడేశారు.
అయినా ఆమె మాత్రం దొరకలేదు. అయితే సరిగ్గా మూడు రోజుల తర్వాత స్థానికులు అందరూ కంగారుగా ఆమెను గాలిస్తున్న సమయంలో ఆమెకు ఎంతో కూల్గా బస్సు దిగి ఇంట్లోకి వెళ్లింది. అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇక పిచ్చి కోపం లో ఉన్న గ్రామస్తులు ఆమెపై దాడి చేసేందుకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. మూడు రోజులపాటు అనంతపురం జిల్లా తాడిపత్రి లోని అక్క బావ ఇంటి వద్ద ఉన్న అంటు సదరు మహిళ సమాధానం చెప్పింది. దీంతో రసూల్బి తో పాటు అక్క బావ ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. తన భర్తకు కూతురికి ప్రాణగండం ఉందని మూడు రోజులపాటు కనిపించకుండా పోతే తగ్గిపోతుందని నమ్మకంతో ఇలా చేసాను అంటు సమాధానం చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు..