అయితే గతంలో బయట ఆకతాయిల నుంచి లైంగిక వేధింపులు ఎదురైన సమయంలో ఇక తమ సమస్యలు ఇంట్లోవారికి చెప్పుకునే వారు ఆడపిల్లలు. ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పి ఇక సమస్యలు పరిష్కరిస్తారు అని భావించేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఏకంగా ఇంట్లో వాళ్లే లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనస్తాపంతో ఎంతోమంది ఆడపిల్లలు దుర్భర జీవితాన్ని గడుపుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆపదలో నేనున్నాను అండగా నిలవాల్సిన అన్నా చెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
జార్ఖండ్ లో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లోహార్దాగా జిల్లా లో ఏకంగా సొంత అన్నయ్యే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చెల్లెళ్లను కాటేశాడు. మైనర్లు అయిన ఇద్దరు చెల్లెళ్ళపై మూడు రోజులుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు చివరికి తల్లికి అసలు విషయం చెప్పారు. ఈ క్రమంలోనే అడ్డువచ్చిన తల్లిపై కూడా అత్యాచారానికి ప్రయత్నించాడు ఆ దుర్మార్గుడు. ఈ క్రమంలోనే తల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.