ఇటీవలి కాలంలో ఎంతో మంది కామాంధులు ఆడపిల్లలపై అత్యాచారాలు చేసి దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  మరోవైపు అటు వరకట్న వేధింపుల కారణంగా ఆడపిల్లలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వస్తున్నాయి.. ఇలా అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి కాటికి వెళ్లే వరకు కూడా ఆడపిల్ల అనుక్షణం ఏదో ఒక విధంగా వేధింపులకు గురవుతూనే ఉంది అని చెప్పాలి. ఇటీవలి కాలంలో పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే అసలు స్వరూపాన్ని బయటపెట్టి వరకట్న వేధింపులతో ఆడపిల్లలను చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై పది నెలలు అయింది అత్తింటివారి వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయ్. దీంతో విసిగి వేసారి పోయింది ఆ యువతి. దీంతో జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని సిరిసిల్ల పట్టణానికి చెందిన శ్రీనివాసరావు కొన్నేళ్ళ క్రితం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చి సెటిల్ అయ్యారు. ప్రైవేటు ఉద్యోగి అయిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నిఖిత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదయ్ తో గత ఏడాది జూన్ ఆరవ తేదీన తన పెద్ద కూతురు నిఖితకు  వివాహం జరిపించాడు శ్రీనివాస్ రావు.


 వివాహ సమయంలో 10 లక్షల నగదు 35 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. అయితే శ్రీనివాసరావుకి సొంతూరులో 4.25 ఎకరాల వ్యవసాయ భూమి అందులో సగం భూమి తన పేరుపై రాయించాలని ఇక నిఖిత ను భర్త వేధించడం మొదలుపెట్టాడు. తన మరణానంతరం కూతుళ్లకు ఆస్తి చెందుతుందని తెగేసి చెప్పాడు శ్రీనివాసరావు. వరకట్న వేధింపులు ఎక్కువవడంతో ఇటీవలే మరో పది లక్షల ముట్ట చెప్పారు. ఇక అతని వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చింది నిఖిత. అయినప్పటికీ ఫోన్లో తరచూ వేధించేవాడు. ఇటీవలే మరోసారి గొడవపడటంతో  మనస్తాపం చెందిన నిఖిత  ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారి  వేధింపుల కారణంగానే కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఉదయ్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: