అయినప్పటికీ ఆకతాయిల వేధింపులు నేపథ్యంలో ఆడపిల్లలు భయపడుతూ ఉంటే.. కొంతమంది మహిళలు మాత్రం తమను వేధించిన వారి తాట తీస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ వున్నాయి. కోపం వస్తే ఆడది అబల కాదు సబల అని ఇలాంటి ఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. తనను వేధించిన ఆకతాయికి ఓ యువతి గట్టిగా బుద్ధి చెప్పింది. ఏకంగా నడిరోడ్డుమీద యువకుడిని చితకబాదింది యువతి.
ఈ ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం లో పనిచేస్తున్న యువతి రాత్రి పూట విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలోనే బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ పోకిరి సదరు యువతిని అడ్డగించాడు. అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేశాడు. అయితే రాత్రి సమయం కావడంతో అందరిలా ఆ యువతి భయపడలేదు. అక్కడి నుంచి వెళ్లిపోలేదు. ఏకంగా కాళిక అవతారమెత్తి కర్రతో సదరు యువకుడిని చితకబాదింది. యువకుడిని కింద పడేసి కాలితో తన్నడం చేసింది. అంతేకాకుండా ఆడపిల్లలను ఇంకోసారి వేధించావ్ అంటే తాటతీస్తా అంటూ హెచ్చరించింది. నన్ను వదిలేయ్ అంటూ ఆ యువకుడు ఎంత ప్రాధేయపడినా యువతి మాత్రం శాంతించలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.