
పరాయి వ్యక్తుల విషయంలో కాదు అటు సొంత వాళ్ల విషయంలో కూడా ఎలాంటి జాలీ దయా చూపించక పోవడంతో ఇక రానున్న రోజుల్లో సభ్యసమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఏ క్షణంలో ఎవరి నుంచి ప్రాణహాని ఉంటుందో అని ప్రతిక్షణం అందరు భయపడుతూనే బ్రతుకుతున్నారు. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో ఏకంగా ప్రేమించిన ప్రియుడి కోసం సొంత తల్లి దండ్రులను హత మారుస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేస్తూన్నాయ్.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ప్రేమకి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఏకంగా కన్న తండ్రిని ఒక మైనర్ కూతురూ హత్య చేసిన ఘటన మహబూబాబాద్ మండలంలో వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ప్రభావతి ప్రేమించింది. ఇక మైనారిటీ తీర లేదు కాబట్టి రెండేళ్లు ఆగితే పెళ్లి చేసి ఆస్తిని అప్పగిస్తాను అంటూ తండ్రి చెప్పాడు. కానీ రెండేళ్ల వరకు ఆగలేకపోయింది ప్రభావతి. చివరికి ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చింది. తాగొచ్చి రోజు వేధించేవాడని అందుకే హతమార్చారు అంటూ కొత్త నాటకానికి తెర లేపింది. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.