ఇక్కడ ఓ దారుణ ఘటన జరిగింది. ఏకంగా ప్రేమిస్తున్నాను అంటూ చెప్పిన ప్రియుడినే దారుణంగా హత్య చేయించింది ఇక్కడ ఒక మహిళ. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. తనను పెళ్లి చేసుకోకపోతే అక్రమ సంబంధాన్ని బయట పెట్టేస్తాను అంటూ ప్రియుడు బ్లాక్ మెయిల్ చేయడంతో ఒక గృహిణి చివరికి ఆందోళన చెందింది. దీంతో తన ఫేస్బుక్ మిత్రుడితో కలిసి ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి రావడం గమనార్హం.
యశ్వ కుమార్ అనే వ్యక్తి వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్. మీర్పేట ప్రశాంతి హిల్స్ కు చెందిన శ్వేత రెడ్డి గృహిణి కావడం గమనార్హం. వీరిద్దరు కూడా 2018 లో ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఇక వీరిద్దరి మధ్య చనువు పెరిగింది. చివరికి అక్రమ సంబంధానికి దారితీసింది. ఇక ఆమెకు ఫోన్ చేసి యష్మ కుమార్ నగ్నంగా వీడియో కాల్ కావాలి అంటూ కోరాడు. ఇక సదరు గృహిణి కూడా కూడా కాదనకుండా వీడియో కాల్ చేసింది. ఇక సరిగ్గా నెల రోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించాడు. ఈ క్రమంలోనే వేధింపులు తట్టుకోలేక పోయినా మహిళా చంపాలని ఫేస్బుక్ ఫ్రెండ్ కూ చెప్పింది. ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు..