ఇక్కడ కూడా ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో కార్ల ఛేజింగ్ ఎక్కువగా ఉంటుంది. శృతి మించిన వేగంతో కారు నడుపుతూ ఉండటం చూస్తూ ఉంటాం. కన్ను మూసి తెరిచేలోపు కార్లు దూసుకుపోతూ ఉంటాయి. ఇక్కడ జరిగిన ప్రమాదం చూసిన తర్వాత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లోని సీన్ రిపీట్ అయ్యింది అని అనుకోకుండా ఉండలేరు అందరు. కనురెప్ప కాలంలో కారు అత్యంత వేగంగా భవనంలోకి దూసుకుపోయిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ ఘటన ఓహియోలో వెలుగులోకి వచ్చింది. కొలంబస్ లోని ఒక కన్వెన్షన్ సెంటర్ వద్ద జరిగింది ఈ ఘటన. అతివేగంతో వస్తున్న టెస్లా ఎలక్ట్రికల్ వెహికల్ గ్రీన్ సిగ్నల్ దాటడం కోసం వేగంగా ముందుకు దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే కారు కంట్రోల్ కాకపోవడంతో ఏకంగా ఎదురుగా ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్ భవనంలోకి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో కారు ఏకంగా 112 కిలోమీటర్ల వేగంతో ఉండడం గమనార్హం. రెప్పపాటుకాలంలో కారు భవనంలోకి దూసుకుపోయిన వీడియో కాస్త చెక్కర్లు కొడుతుంది. ఇది చూసి అందరూ అవాక్కవుతున్నారు.