నేటి రోజులలో జనాలు మానవత్వం విచక్షణ ఉన్న మనుషుల్లా కాదు ఏకంగా విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారిపోతున్న క్రూర మృగాల లాగానే కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది సాటి మనుషుల విషయంలోనే దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలూ అందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. చాక్లెట్ తిన్నంత వీజీ గా సాటి మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు నేటి రోజుల్లో జనాలు. దీంతో  ఎటువైపు నుంచి ప్రాణహాని ఉందో అన్నది తెలియక అనుక్షణం భయపడుతూనే బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఇటీవల ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మండలం అమృత నగర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నరసింహ అనే 27 ఏళ్ల యువకుడిపై ముఖంపై కొంతమంది స్థానికులు పెట్రోల్ పోసి నిప్పంటించటం కలకలం సృష్టించింది. దీంతో తీవ్ర గాయాలపాలైన నర్సింహను పొద్దుటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉండడంతో రిమ్స్ కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు మండలం మడ్డురు రోడ్డు కు చెందిన నరసింహ పాత బట్టలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ బతుకు బండి నడిపిస్తున్నారు. అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.


 అయితే ఇటీవలే మద్దూరు రోడ్డు లోని కాళీ ప్రదేశం లో నరసింహ మద్యం సేవిస్తూ మొబైల్ ఫోన్లో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. పక్కనే ఉన్న చిన్న ప్రసాద్ ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావ్ మాకు చిరాకుగా ఉంది అంటూ వాగ్వాదానికి దిగాడు. ఇక మాటా మాటా పెరగడంతో ద్విచక్రవాహనం లోని పెట్రోల్ తీసిన చిన్న, ప్రసాద్ మరికొందరితో కలిసి నరసింహ ముఖంపై పోసి నిప్పంటించారు. దీంతో ముఖం శరీరం పై  కూడా గాయాలు అయ్యాయి. గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నరసింహను పొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరచుగా పరిస్థితి విషమించడంతో రిమ్స్ కీ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: