
కానీ కొంతమంది మాత్రం ఇలాంటివేవీ పట్టించుకోకుండా మొసళ్ళు ఉన్నాయి అని హెచ్చరించిన అదే ప్రాంతంలో కి వెళ్లి ఇక స్నానం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చివరికి ప్రాణాపాయ స్థితిని కొని తెచ్చుకుంటూ వుంటారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు 38 ఏళ్ల వ్యక్తి. ఇక అక్కడే ఒక మొసలి కాపు కాచుకుని కూర్చుంది. చివరికి అతడు నీళ్లలోకి దిగగానే దూసుకువచ్చి దాడిచేసి అతన్ని నదిలోకి లాక్కెళ్ళి పోయింది. ఈ ఘటన రాజస్థాన్ లోని కోట లో వెలుగులోకి వచ్చింది.
బిల్లు అనే వ్యక్తి ఖాటోలి పట్టణంలోని పార్తి నదిలో రామ్ ఘాట్ వద్ద స్నానం చేసేందుకు దిగాడు. ఇక అక్కడే నదిలో కాపు కాచుకుని ఉన్న ఒక మొసలి అతనిపై ఒక్కసారిగా దాడి చేసింది. క్షణాల వ్యవధిలోనే అతని లోపలికి లాక్కెళ్ళింది. అదే నదిలో స్నానం చేస్తున్న మిగత వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగం లోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతదేహం కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇటీవలే యూపీలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. స్నానానికి దిగిన చిన్నారిని ముసలి బలితీసుకుంది..