వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ తులసి నగర్ లో ఉండే వెంకటేష్ రైల్వే లో టిటిఐ గా పని చేస్తున్నాడు. ఇక ఆయన భార్య ప్రియాకు డబ్బు పై ఎక్కువగా ఆశ ఉండేది. ఈ క్రమంలోనే అక్కడక్కడ చోరీలకు కూడా పాల్పడుతూ ఉండేది నిజాంపేట లో ఉండే వెంకాయమ్మ తన కుమార్తె శ్రీమంతం మణుగూరు లో ఉండడంతో బంగారాన్ని తీసుకొని ఇక సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుని అక్కడ రైల్ ఎక్కుతున్న క్రమంలో నిందితురాలు అక్కడికి చేరుకొని ఇక లిఫ్ట్ లో ఉన్న రద్దీనీ ఆసరాగా చేసుకొని బ్యాగ్ లో ఉన్న నగలు దొంగలించింది.
అయితే ఇక ఫ్లాట్ ఫారం వద్దకు వెళ్లిన వెంకాయమ్మ బ్యాగులో నగల బాక్స్ లేకపోవడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది రైల్వే డిజీపి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు పలు బృందాలుగా ఏర్పడ్డారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా చివరికి నిందితురాలిని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం అంగీకరించారు. అయితే ప్రియా పై ఇప్పటికే కేపీహెచ్బీ తో పాటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా గుర్తించారు పోలీసులు..