ఇక్కడ కూడా కొంతమంది వాహనదారులు ఆంబులెన్స్ వెళుతూ ఉంటే ఇక దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కాగా ఇక్కడ ఇలా అంబులెన్స్ లో దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తే చివరికి ఊహించని విధంగా వాహనాలు అన్నీ కూడా ప్రమాదానికి గురి అయ్యాయి అదేంటి అంబులెన్స్ కు దారి ఇవ్వడం వల్ల ప్రమాదం జరగడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. ఆ విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంబులెన్స్ కి దారి ఇచ్చే క్రమంలో ఏకంగా ఒకేసారి ఏడు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టిన ఘటన చేవెళ్ల లోని బిజాపూర్ రహదారిపై వెలుగుచూసింది. చేవెళ్ల నుంచి హైదరాబాద్ వైపు వచ్చే క్రమంలో ముందు వైపు నుంచి ఒక ఆంబులెన్స్ వస్తుంది.
అయితే దీన్ని గమనించిన ముందు కారు నడుపుతున్న వ్యక్తి వాహన వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు.. అంబులెన్స్ కి దారి ఇవ్వాలని ప్రయత్నించాడు. దీంతో ఆ కారు వెనుక వస్తున్న 7 కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొన్నాయి. కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే పలువురు వాహనదారులు చొరవ తీసుకుని ప్రమాదానికి గురైన కార్లను రోడ్డు పక్కకు తప్పించి.. చివరికి ట్రాఫిక్ క్రమబద్దీకరించడం గమనార్హం. అయితే వాహనాల మధ్య కనీస దూరం పాటించకపోవడం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.