ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి మాత్రం అక్కడ ప్రాక్టీస్ చేసే ఆట గురించి అస్సలు పట్టించుకోలేదు. తాను తన కుక్క తో కలిసి సరదాగా వాకింగ్ కు వచ్చే సమయంలో స్టేడియంలో క్రీడాకారులు ఎవరు కనిపించకూడదని స్టేడియం మొత్తం ఖాళీ గా ఉండాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. ఐఏఎస్ అధికారి కావడంతో అధికారులు కూడా నో చెప్పకుండా స్టేడియాన్ని ఖాళీ చేయడం లాంటివి చేస్తూ వచ్చారు. కానీ ఇక ఈ ఐఎఎస్ అధికారి తీరుతో పాటు క్రీడాకారులు మాత్రం ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు.
కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు చక్కబడతాయి అనుకున్నారు క్రీడాకారులు. కానీ రోజురోజుకీ ఐఏఎస్ అధికారి వ్యవహరిస్తున్న తీరు నచ్చకపోవడంతో చివరికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయం ఏకంగా ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో క్రీడాకారులు రాత్రి వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే సంజీవ ఖిరవార్ అనే ఐఎఎస్ అధికారి స్టేడియం ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. వారు ఖాళీ చేయించారు. దీంతో క్రీడాకారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా దీనిపై స్పందించిన సీఎం కేజ్రీవాల్ స్టేడియం అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించడం గమనార్హం..