
సాధారణంగా పోలీసుల కంటపడకుండా రహస్యంగా ఒక గది అద్దెకు తీసుకుని అందులోనుంచే ఇక వివిధ రాష్ట్రాలలో బెట్టింగ్ మాఫియా నడిపించడం లాంటివి చేయడం ఇప్పటి వరకు చూశామూ. ఇలాంటివి చేస్తున్న వ్యక్తులను కూడా అరెస్టు చేశారు పోలీసులు. కానీ ఇక్కడ మాత్రం బెట్టింగ్ ముఠా ముందడుగు వేసింది అని తెలుస్తుంది. రహస్యంగా ఎక్కడో సీక్రెట్ గా బెట్టింగ్ మాఫియా నడిపించడం కాదు.. స్టేడియం లో లైవ్ మ్యాచ్ వీక్షిస్తూ బెట్టింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇది కాస్తా ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు తెలుస్తోంది. మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షిస్తూనే ఆన్లైన్లో బెట్టింగ్ చేయడం మొదలు పెట్టారట. తోటి ప్రేక్షకులు ఇది గమనించి వెంటనే స్టేడియం సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని తెలుస్తోంది కాగా పట్టుబడిన ఐదుగురు బీహార్‌కు చెందిన వ్యక్తిలుగా పోలీసులు గుర్తించారు వీరు ఇచ్చిన సమాచారం మేరకు కోల్‌కతాలోని మరో గెస్ట్ హౌస్ లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి నగదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు..