ప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం.. రెండు మనసుల మధ్య పుట్టిన ప్రేమ ఇక జీవితాంతం గుర్తుండిపోయే మెమోరీస్ ఇస్తుంది అన్న విషయం తెలిసిందే.. ఇక ఇలాంటి మాటలు కేవలం సినిమాల్లో లవ్ స్టోరీ లకు మాత్రమే సెట్ అవుతున్నాయ్. కానీ నిజజీవితంలో ప్రేమకథలు చూసుకుంటే రక్తపాతం తప్ప ఎక్కడ  మధుర జ్ఞాపకాలు మాత్రం కనిపించడం లేదు. ప్రేమించి పెద్దలని ఎదిరించి కులమతాలకు అతీతంగా పెళ్లి చేసుకుంటే పరువు హత్యలకు గురిఅవుతున్నాయి ప్రేమ జంటలు. ఇంకొన్ని చోట్ల ప్రేమను గెలిపించుకోలేక పోయామే అనే బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల ఇక ప్రేమను అంగీకరించలేదని రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు ఎంతో దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.


 ఇలా ఇటీవలికాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు అత్యంత దారుణంగా హత్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి. ఏకంగా ప్రేమ వ్యవహారంలో తల్లి కుమార్తె పై ఓ యువకుడు దారుణంగా దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న బ్లెడ్ తో దాడి చేసి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే తప్పించుకునేందుకు ప్రయత్నించారు తల్లి కూతుర్లు. ఈ ఘటనలో తీవ్ర గాయాల బారిన పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కృష్ణా నగర్ లో వెలుగులోకి వచ్చింది.


 కృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇలా తల్లీకూతుళ్లపై దాడి చేసిన యువకుడు ఆ తర్వాత రెండో అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. అయితే గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండడం గమనార్హం. సదరు యువకుడు తల్లీకూతుళ్ల పై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రేమే కారణం అయి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: