
కానీ ఇటీవలి కాలంలో కొంతమంది మహిళలు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల విషయంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం తల్లి ప్రేమ కి మచ్చ తెచ్చే విధంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తన కడుపున పుట్టిన పిల్లల విషయంలో కాస్తయినా జాలి చూపించలేకపోయింది ఆ తల్లి. చివరికి పిల్లల విషయంలో కర్కశంగా ప్రవర్తించి ప్రాణాలను తీసేసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ దారుణ ఘటన. తరచూ ఏడుస్తున్నారు అన్న కారణంతో రెండు రోజుల వ్యవధిలోనే నాలుగు నెలల పసి పాప తో పాటు రెండేళ్ల కుమారుడి గొంతునులిమి ప్రాణం తీసింది.
అంతటితో ఆగకుండా ఇద్దరు పిల్లల మృతదేహాలను పొలంలో కాల్చి వేయడం గమనార్హం. బోకర్ లోని పాండుర్గ్ గ్రామానికి చెందిన దుర్బరాబాయికీ రెండేళ్ల కుమారుడు నాలుగు నెలల చిన్నారి అనసూయ ఉన్నారు. అయితే పిల్లలిద్దరూ ఇటీవలే ఆపకుండా ఏడుస్తుండటంతో ఆగ్రహించిన తల్లి నాలుగు నెలల పసికందు గొంతు నులిమి చంపేసింది. తర్వాత రోజు ఆహారం కోసం ఏడ్చినా కుమారుడిని అదేరీతిలో గొంతునులిమి హత్య చేసింది. పొలంలో ఇద్దరిని కాల్చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం మారగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..