
ఈ ఘటన పశ్చిమబెంగాల్లో వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బుర్ద్వాన్ లోని దుర్గాపూర్ లో ఉంటుంది రేణు ఖాతున్ అనే వివాహిత. అయితే ఇటీవల ఎంతో కష్టపడి ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం సంపాదించింది. అయితే ఆమె ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించిన వెంటనే ఆమె భర్త మహమ్మద్ షేక్ కు అనుమానం పెరిగి పోయింది. ఈ క్రమంలోనే మరో వ్యక్తి కోసం తనను మోసం చేస్తోంది అంటూ అనుమానించడం మొదలు పెట్టాడు. దీంతో స్నేహితులతో కలిసి బాధితురాలి చెయ్యి నరికాడు. ముందు ఆమె చేతులను దిండుతో అదిమి పెట్టి పదునైన కత్తితో చేయి నరికాడు.
ఈ క్రమం లోనే మొదట ఆమెను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత తీవ్ర గాయాలు కావడంతో దుర్గాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని రేణు కల నెరవేరింది. కానీ భార్యను ఉద్యోగంలో ఉండ కుండా చేయడానికి భర్త చేసిన ప్రయత్నం మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి. ఇక చేతి వేలు తెగి పడటం కారణంగా రేణు ఖాతున్ కల చెదిరిపోయింది అని చెప్పాలి..