ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తప్ప ఎక్కడా తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ భద్రత కల్పించినప్పటికీ కూడా నేరస్తులు మాత్రం రెచ్చిపోతూ ఏదో ఒక విధంగా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఆడ పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలు సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉంది. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి.



 ఏదో ఒక విధంగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అత్యాచారాలు చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలా నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా మైనర్లే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం అన్నది తెలుస్తుంది. ఇటీవలే తెలంగాణలో కూడా ఇలాంటి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి సంస్థాన్ నారాయణపురం మండలం లో కొర్ర తండా లో ఇద్దరు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు నిద్రిస్తున్న 40 ఏళ్ళ మహిళ బట్టలు విప్పి ఫోటోలు వీడియోలు  తీశారు. ఆ తర్వాత ఫోటోలు వీడియోలు  చూపించి బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టారు.


 అంతటితో ఆగకుండా ఇక ఆ ఫోటోలను తమ స్నేహితులకు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. దీంతో ఈ విషయం తెలిసిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం తెలిపింది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక నేరానికి పాల్పడిన ఇద్దరు మైనర్ లలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా స్థానికంగా ఈ ఘటన సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఎప్పుడూ మైనర్లపై ఒక కన్నేసి ఉంచాలి అని పోలీసులు సూచిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: