
మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కాపర్ ఖేడా పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో ఘటన వెలుగు చూసింది. ఇటీవలే సదరు ఏటీఎం లోకి వెళ్ళిన ఒక వ్యక్తి 500 విడుదల చేసేందుకు ప్రయత్నించాడు. అయితే 500 ఎంటర్ చేసిన తర్వాత ఐదు వందలు విలువైన ఐదు కరెన్సీ నోట్లు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మరోసారి అదే విధంగా ట్రై చేస్తే ఇంకోసారి కూడా 2500 రూపాయలు వచ్చాయి. దీంతో స్థానికంగా ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అందరూ కూడా నగదు విత్ డ్రా చేసుకునేందుకు సదరు ఏటీఎం వరకు బారులు తీరారు.
కొంతమంది పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందికి ఇక అక్కడ జరిగిన విషయాన్ని వివరించి సమాచారం అందించారు. అయితే ఇలా ₹500 కొడితే 2500 రావడానికి కారణం కూడా లేకపోలేదు. వంద రూపాయల విలువైన నోట్లను ఉంచాల్సిన ట్రే లో 500 రూపాయల నోట్లను తప్పుగా జమ చేయ డంతో ఇలా జరిగిందని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇక ఏర్పడిన సాంకేతిక సమస్యలు పరిష్కరించి ఆ తర్వాత వినియోగదారులకు ఏటీఎం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.