ప్రభుత్వాలు ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేయిస్తున్న అటు కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఒంటరిగా కనిపించే ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్న వారు కొంతమంది అయితే మంచి వాళ్ళ ముసుగులో సమయం సందర్భం కోసం ఎదురు చూస్తూ చివరికి దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారి మరికొంతమంది. ఇలా ప్రతి రోజు రోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు అని చెప్పాలి.
ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికపై కొన్నాళ్ల నుంచి అత్యాచారం చేస్తూ వస్తున్న యువకుడు చివరికి బాలికను గర్భవతిని చేశాడు. పల్నాడు జిల్లా నరసారావు పేట లోని ప్రకాష్ నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. బాలికపై మున్నా అనే యువకుడు గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఇటీవలి వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించగా ఏడు నెలల గర్భవతి గా తేలింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా షాక్ లో మునిగి పోయిన బాలిక తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. ఇక బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడు మున్న పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.