సాధారణంగా ప్రేమ అంటే ఒక మధురానుభూతి. రెండు మనసుల కలయిక వల్ల జీవితం ఎంతో సంతోషంగా ఉంటాము అనే నమ్మకం కలిగించే ఓ సరికొత్త బంధం ప్రేమ.  ముక్కు ముఖం తెలియని వారిని జీవితాంతం కలిసి ఉండేలా చేస్తూ ఉంటుంది ప్రేమ. కానీ వాస్తవానికి వస్తే మాత్రం ప్రేమ అంటే ఎంతో డేంజర్ అన్నట్లుగా మారిపోయింది. ఎందుకంటే నేటి రోజుల్లో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కారణం గా మారిపోతుంది.. లవ్ అనేది కమర్షియల్ ఎలిమెంట్ అన్నట్లుగా చూస్తున్న నేటి రోజుల్లో యువత కేవలం అవసరాల కోసం మాత్రమే ప్రేమిస్తున్నారు.


 సిన్సియర్ గా లవ్ చేసి ఇక ప్రేయసి కోసమే బతుకుతున్న వారూ ఎక్కడో కొంతమంది మాత్రమే కనిపిస్తుంటే.. అవసరాల కోసం ప్రేమించేవారు అడుగడుగునా కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలా ప్రేమ పేరుతో వెంటపడటం ప్రేమ ఒప్పుకోకపోతే ఉన్మాదులు గా  మారిపోయి హత్యలకు పాల్పడడం.. ఒకవేళ ప్రేమ ఒప్పుకుంటే అవసరాలు తీర్చుకుని నడిరోడ్డు మీద వదిలేయడం లాంటివి చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా ప్రేమించిన ప్రియురాలిని బ్లాక్మెయిల్ చేసి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ప్రేమ మరో ప్రాణం పోవడానికి కారణమైంది.


 నువ్వు లేకుండా నేను ఉండలేను చచ్చి పోతున్నాను అంటూ యువకుడు బెదిరింపులకు పాల్పడటంతో చివరికి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. యూపీ కి చెందిన 17 ఏళ్ల యువతికి కొన్ని రోజుల క్రితం మిస్డ్ కాల్ ద్వారా 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇటీవలే యువతికి  ఫోన్ చేసి వీడియో కాల్ చేయాలని కోరాడు సదరు యువకుడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక రైలు కింద పడి చనిపోతున్నాను అంటూ యువతికి మెసేజ్ పంపడంతో కంగారుపడి నలభై సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడనే ఆందోళనలో చివరికి విషం తాగి సూసైడ్ కి  పాల్పడింది. అయితే విషయం తెలుసుకున్న యువకుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: