పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అనే విషయం తెలిసిందే . పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో సామాన్యులు సైతం అప్పు చేసి మరీ ఇంత ఘనం గా పెళ్లి చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. నేటి రోజుల్లో ట్రెండ్ ఫాలో అవుతూ  సంపన్నుల లాగానే ఘనంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే పెళ్లి అంటే బంధు మిత్రులందరికి అందరికీ ఇష్టం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే బంధుమిత్రులందరికీ పెళ్లి అంటే ఎక్కువగా ఇష్టపడితే అటు స్నేహితులు మాత్రమే ఎక్కువగా ఇష్టపడేది పెళ్లి బరాత్ . పెళ్లి ఉంది అని ఇన్విటేషన్ ఇవ్వగానే స్నేహితుడు అడిగె మొదటి ప్రశ్న కూడా అదే. బరాత్ ఉందా లేదా అంటూ క్లారిటీ తీసుకుంటాడు. ఒకవేళ ఉంది అని చెబితే  ఇక స్నేహితుడి బరాత్ ఎంజాయ్ చేయాలి అని ముందే ప్లాన్ చేసుకుంటాడు. అందుకే ఇటీవలి కాలంలో పెళ్లి కాస్త మామూలుగా జరిగిన ఇక బరాత్ మాత్రం ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు.


 అయితే ఇలా ఘనంగా పెళ్లి బరాత్ నిర్వహించిన సమయంలో స్నేహితులకు ఏదైనా తక్కువ అయ్యింది అంటే చాలు హర్ట్ అవుతూ ఉంటారు. చివరికి బరాత్ డాన్స్ చేయకుండానే వెళ్ళి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పెళ్లి కొడుకు చేసిన పనికి అతని స్నేహితులు హర్ట్ అవడమే కాదు 50 లక్షల పరువు నష్టం దావా కూడా వేసారూ. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రవి అనే వ్యక్తి పెళ్లి జరిగింది. అయితే బరాత్ లో ధూమ్ దాం డాన్స్ చేయాలని స్నేహితులు అనుకున్నారు. అయితే స్నేహితులు వరుడు ఇంటికి వచ్చేసరికి ఇక వరుడు కుటుంబ సభ్యులు మాత్రం అంతా సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయారు. దీంతో పెళ్లికి పిలిచి అవమానిస్తారా అని ఫ్రెండ్స్ పెళ్ళికొడుకుపై 50 లక్షల పరువు నష్టం దావా వేశారు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: