దీంతో చిన్నచిన్న కారణాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. టీచర్ తిట్టిందని.. తల్లిదండ్రులు మందలించారని.. స్నేహితులతో గొడవ జరిగిందని.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చిన్న కారణాలే.. గట్టిగా తలచుకుంటే తీరిపోయే సమస్యలకే ఇక జీవితం అక్కడితో ముగిసిపోయింది అని ఎంతో మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ సమస్యలు అన్ని తీరిపోవాలంటే ఆత్మహత్య ఒక్కటే దారి అని భావించి చివరికి సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
తనకు ఉద్యోగం రాలేదని పెళ్లి కావడం లేదు అంటూ ఎంతగానో మనస్థాపం చెంది తనలో తానే కుంగిపోతూ యువతి చివరికి ఆత్మహత్య బలవన్మరణానికి పాల్పడిన ఘటన చెన్నైలోని కలంబక్కంలో వెలుగులోకి వచ్చింది. విలియం జేమ్స్ కుమార్తె జెన్నీఫర్ గతంలో ఐటీ సంస్థలో పనిచేస్తూ ఉండేది. కరోనా వైరస్ కారణంగా ఆమె జాబ్ పోయింది. ఇక తర్వాత ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా జాబ్ రాలేదు. ఆమె వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు కావడం గమనార్హం. అయితే పెళ్లి చేసుకునేందుకు ఎన్ని సంబంధాలు వచ్చినా అవి సెట్ కావడం లేదు. ఒకవైపు జాబ్ రావడం లేదు మరోవైపు పెళ్లి సెట్ కావడం లేదని మనస్థాపంతో చివరికి ఆత్మహత్యకు పాల్పడింది..