
ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం కొంతమంది అమాయకులను బంగారం డబుల్ చేస్తాను అంటూ చెప్పి బురిడీ కొట్టించి మొత్తం దోచేస్తాడు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి కొర్లగుంట కాలనీలో నివాసముంటున్నాడు శివ ప్రసాద్. టీటీడీ లో కాంట్రాక్టు కొలువు చేసుకుంటూ ఉన్నాడు. ఇక మనిషి మంచి ఉండడంతో కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్రమంలోనే అదే కాలనీలో గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు వ్యక్తులు గోల్డ్ కవరింగ్ నగలు అమ్ముతూనే మంత్రాలతో కష్టాలను తీర్చేస్తాము అంటూ మాయమాటలతో నమ్మించడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఓ మహిళ శివప్రసాద్ కుటుంబ సభ్యులను మాయమాటలతో బుట్టలో వేసుకుంది. ఏకంగా ఇంట్లో ఉన్న నగలను డబుల్ చేస్తాం అంటూ చెప్పింది. దీంతో ఆశపడ్డారు సదరు కుటుంబీకులు. ఈ క్రమంలోనే పూజ చేసే సమయంలో ఇంట్లో ఉన్న బంగారు వెండి నగల తో పాటు 5వేల రూపాయల నగదును కూడా పూజలు ఉంచాలి అని చెప్పింది. ఇక మంత్రగత్తె చెప్పిన విధంగానే వాళ్ళు చేశారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులను నమ్మించేందుకు కాసేపు పూజ చేసి వారిని మైకంలో ఉంచింది మహిళ.
ఇక ఆ తర్వాత మొత్తం ఎర్రటి గుడ్డలో కట్టుకుని దాచేసింది. ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న ఒక బాక్స్ ను అక్కడ ఉంచి పూజ పూర్తయిందనీ చెప్పింది. ఒక కుటుంబ సభ్యులు అందరూ కూడా సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత బాక్స్ ఓపెన్ చేయాలని ఆ తర్వాత కష్టాలు మొత్తం తొలగిపోతాయి అంటూ నమ్మబలికింది. దీంతో మహిళలు చెప్పినట్టుగానే కుటుంబ సభ్యులు చేశారు. అందులో బియ్యంతో పాటు ఒక రూపాయి బిళ్ళ ఉంది. దీంతో శివ ప్రసాద్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.