
ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాను అని ప్రమాణం చేసిన భర్త కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఘటన లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే చివరికి కట్టుకున్న భార్యను హతమార్చిన ఘటనలు అందరిని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అంతేకాకుండా పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడం తో కేవలం భార్య లోనే సమస్య ఉందని భావిస్తూ ఎంతోమంది చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సూటిపోటి మాటలతో మానసికంగా వేధించడమే కాదు శారీరకంగా కూడా హింసిస్తూ చివరికి ఎంతో మంది యువకుల ప్రాణాలు పోయే పరిస్థితి కూడా తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయినా పిల్లలు పుట్టలేదు అనే కారణంతో ఏకంగా భార్యపై భర్త తో పాటు అత్తమామలు సలసల కాగుతున్న నూనెలో పోసారు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పెళ్ళై ఆరేళ్ల అవుతుంది కానీ పిల్లలు కాలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆమె భర్త ప్రతాప్ బంజారా అత్తామామలు కలిసి వేడి నూనె తెచ్చి నిద్రిస్తున్న మహిళ ముఖంపై పోశారు. దీంతో బాధితురాలు ముఖం మొత్తం కాలిపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.