దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇలాంటి హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలో ఉన్న ఒక అపార్ట్ మెంట్ లోని 11 వ అంతస్తు నుంచి ఐదేళ్ల పిల్లవాడు కింద పడి మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది అని చెప్పాలి. ముంబైలోని బైకుల్ల ప్రాంతంలో హౌజింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. పిల్లవాడు తన ఫ్లాట్లోనే గోడ పట్టుకొని ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. పదకొండవ ఫ్లోర్ లో ఉన్న తన ఫ్లాట్ కు ఉన్న ఓపెన్ విండో దగ్గర గొడుగు పట్టుకొని ఆడుకుంటున్నాడు ఆ పదేళ్ల బాలుడు.
కాగా పక్కనే ఉన్న మంచం మీదికి ఎక్కి కిటికీలోంచి బయటకు తొంగి చూసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కిటికీలో నుంచి కిందపడిపోయాడు బాలుడు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి తల్లి ఇతర బంధువులు కూడా అదే గదిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఇక సదరు బాలుడిని ఆసుపత్రికి తరలించే లోపు చివరికి ప్రాణాలు వదిలినట్లు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.