ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఆడపిల్ల ధైర్యంగా కాలు బయట పెట్టలేని దుస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో. అయితే ఆడ పిల్లల పై అత్యాచారం చేసుకున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు కోర్టులు కూడా నిందితులకు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఒక నిందితుడికి కోర్టు ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాలికను లైంగికంగా వేధించిన కేసులో విచారణ జరిపిన మెదక్ జిల్లా కోర్టు నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా కోర్టులో సమర్పించారు. ఇక ఈ కేసు పై ఎంతో సీరియస్గా విచారణ జరిపిన మెదక్ కోర్టు పాపన్న పేట కు చెందిన నిందితుడు కి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 31 వేల జరిమానా కూడా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.