
ఎందుకంటే బారం అనుకోకుండా నవమాసాలు మోయడమే కాదు ఇక తన ఊపిరినే ఊపిరి గా అల్లి బిడ్డకు జన్మనిస్తుంది. తల్లికి బిడ్డ పుట్టిన తర్వాత కూడా అల్లారుముద్దుగా చూసుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనే దారుణంగా ప్రాణాలు తీయాలని భావించింది తల్లి. మూడు ఏళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ తో కలిసి స్మశానంలో పాతి పెట్టింది. ఈ ఘటన బీహార్లోని సారన్ లో వెలుగులోకి వచ్చింది. బాలిక ఏడుపు విని స్థానికులు వచ్చి సదరు బాలికను కాపాడారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.
మార్హ నది ఒడ్డున ఉన్న స్మశానవాటికలో 3 ఏళ్ళ బాలికను ఆమె తల్లి నాన్నమ్మ పాతిపెట్టారు. అయితే బాలిక ఏడవటంతో ముందు చప్పుడు విన్న మహిళలు ముందుగా దయ్యం ఏడుస్తుంది ఏమో అని కాస్త భయాందోళనకు గురయ్యారు. కొంతమంది స్థానికులు వచ్చి అక్కడ గుమి గూడి పరిశీలించారు. ఈ క్రమంలోనే మట్టిని తొలగించి చూడగా బాలిక ఉంది. చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అప్పటికి బాలిక బ్రతికే ఉండడంతో వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారమందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే బాధిత బాలిక తన పేరు లాలి అని తండ్రి పేరు రాజు శర్మ,తల్లి పేరు రేఖ దేవి అంటూ వెల్లడించింది. ఇక అమ్మ నాన్నమ్మ బయటికి వెళ్దాము తీసుకుని స్మశానవాటికలో పాతిపెట్టినట్లు సదరు బాలిక పోలీసులకు చెప్పింది. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.