
ఈ క్రమంలోనే తర్వాత కాన్పు లో అతని భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది ఇంకేముంది మొక్కు తీర్చుకోవాలి కదా.. పొరుగు గ్రామానికి చెందిన యువకుడిని ఏకంగా దేవుడు బలి ఇచ్చాడు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెవ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సర్ మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిని భయాందోళనకు గురి చేసింది. రాంలాల్ ప్రజాపతి అనే వ్యక్తి భార్య తో కలిసి సర్ మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నారు. ఈ దంపతులకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు.
ఈ క్రమంలోనే ఒక వారసుడు కావాలి అంటూ కొడుకు పుట్టాలని ఎన్నో దేవుళ్లకు మొక్కుతూ వచ్చాడు. తనకు నాలుగు సంతానంగా ఒకవేళ కొడుకు పుడితే నరబలి ఇస్తాను అంటూ అమ్మవారికి మొక్కుకున్నాడు. యాదృచ్ఛికంగా వారికి నాలుగో కాన్పులో కుమారుడు జన్మించాడు. దీంతో అమ్మవారిని ప్రార్థించడం వల్లే కుమారుడు పుట్టాడని రాంలాల్ బలంగా నమ్మాడు. దీంతో మొక్కు తీర్చుకునేందుకు యువకుడి కోసం గాలించి.. చివరికి పొరుగు గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడుకి మాయమాటలు చెప్పి యువకుడిపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపాడు. తర్వాత రోజు యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రాంలాల్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.