నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మనుషులు ఎవరూ కూడా తమ ప్రాణాలకు అసలు విలువ ఇవ్వడం లేదు. పరాయి వ్యక్తులు కోసమే పుట్టి ఈ భూమ్మీదకి వచ్చాం ఏమో అని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు నేటి రోజుల్లో జనాలు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడెందుకు కూడా సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రేమ వ్యవహారంలో ఇలాంటి తరహా ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులోనే ఎంతో మంది మనసులో ప్రేమ పుట్టడం..ఇక ఆ ప్రేమ విఫలమైంది అనే కారణంతో ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు.


 ఇక ఇలా ఎవరూ లేనప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కొంతమంది అయితే కొంతమంది కాస్త విచిత్రంగానే ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. తాము ఆత్మహత్య చేసుకోబోతున్నాము అన్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేసేందుకు  దగ్గరలో ఉన్న సెల్ ఫోన్ టవర్లు సెలెక్ట్ చేసుకుని ఇక సెల్ ఫోన్ టవర్ ఎక్కి చనిపోతాము అంటూ హల్చల్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ టవర్లు, హై టెన్షన్ టవర్లు ఎక్కి సూసైడ్ చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 తమిళనాడులో  19 ఏళ్ల యువకుడు హైటెన్షన్ ఎలక్ట్రికల్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టించాడు. 19 ఏళ్ల యువకుడు ఇలా విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం 15 ఏళ్ల తన గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి నో చెప్పిందని. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. ఇక 19 ఏళ్ల యువకుడు హైటెన్షన్ ఎలక్ట్రికల్ టవర్ ఎక్కడంతో విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా పలు రైల్వే సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి అన్నది తెలుస్తుంది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఎంత నచ్చజెప్పినా యువకుడు క్రిందికి రాలేదు. చేసేదేమీ లేక బాలికను తీసుకువచ్చి నచ్చజెప్పడంతో చివరికి కిందికి దిగి వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: