ముఖ్యంగా నేటి రోజుల్లో యువత క్రేజీ సెల్ఫీ అంటూ ఎన్నో ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లి సెల్ఫీ తీసుకోవడం చివరికి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇక ఇలాంటి ఘటనలు నేటి రోజుల్లో నిత్యకృత్యంమయ్యాయ్ అని చెప్పాలి. సరదాగా తీసుకున్న సెల్ఫీలు డేంజరస్ గా మారిపోయి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఇటీవలే కర్ణాటకలో ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సెల్ఫీ తీసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చివరికి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయింది. సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తిరుపతి వాసి కావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన వనిత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఇటీవల వీకెండ్ సమయంలో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. నది ఒడ్డున నిలబడి సెల్ఫీ తీసుకున్న సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ప్రవాహం ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే సరికే చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహం కూడా లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి అతి కష్టం మీద మృతదేహాన్ని బయటకు తీశారు..