సాధారణంగా డాక్టర్లు అన్న తర్వాత ఎప్పుడు ఎన్నో రకాల వ్యాధులు కలిగి ఉన్న రోగులు వారి దగ్గరికి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఏకంగా డాక్టర్ల దగ్గరికి వచ్చే కేసులు  వైద్యులను అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. యువతి పొత్తికడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులకు చెప్పింది ఆ యువతి. దీంతో సాధారణ నొప్పి అని భావించి ఆమెకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు  కుటుంబ సభ్యులు. అయితే అవి వేసుకున్న తర్వాత కూడా నొప్పి ఎక్కడా తగ్గలేదు కదా మరింత ఎక్కువైంది.


 దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే తీవ్రమైన కడుపు నొప్పి వస్తూ ఉండటంతో డాక్టర్లు ఆమెకు టెస్ట్ లు  నిర్వహించారు. ఈ క్రమంలోనే తర్వాత రిపోర్టులు చూసి డాక్టర్లు సైతం ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. కారణం ఆమె కడుపులో ఏకంగా ఇనుప వస్తువులు ఉండడం గమనార్హం. ఈ ఘటన టర్కీ లోని తూర్పు ప్రావిన్స్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల యువతి పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ వాన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ కు వచ్చింది. ఈ క్రమంలోనే టెస్ట్ లు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు.  ఆమె కడుపులో గోర్లు, సూది తో సహా 158 మెటాలిక్  వస్తువులు ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు.


 ఇక ఎంతో జాగ్రత్తగా దాదాపు రెండున్నర గంటల పాటు శస్త్రచికిత్స చేసి వాటన్నింటినీ కూడా బయటకు తీశారు. ఈ క్రమంలోనే డాక్టర్లు మాట్లాడుతూ మొదట ఎండోస్కోపీ తో కడుపులోని వస్తువులను తొలగించినట్లు చెప్పుకొచ్చారు. రిపోర్టులో చాలా వస్తువులు కనిపించడంతో ఇక చివరికి ఆపరేషన్ చేయక తప్పలేదు అంటూ వెల్లడించారు వైద్యులు. ఇలా శస్త్రచికిత్స చేసిన సమయంలో లోపల ఉన్న వస్తువులను చూసి తాము షాక్ లో మునిగి పోయినట్లు వైద్యులు తెలిపారు.  ప్రస్తుతం యువతి ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు చెప్పుకొచ్చారు వైద్యులు. అయితే ఆ వస్తువులను కడుపులోకి ఎలా వచ్చాయి అనేది మాత్రం అంతుచిక్కని విధంగా ఉంది అంటూ వెల్లడించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: