ఇటీవలి కాలంలో మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది . ఇది ఎవరో చెబుతుంది కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే చెప్పకనే చెబుతున్నాయి. ఒకప్పుడు సాటి మనుషులకు ఏమైనా ప్రమాదం వచ్చిందంటే చాలు అయ్యో పాపం అంటూ గుండె తరుక్కుపోయేది. కానీ ఇప్పుడు సాటి మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే జేబులో ఉన్న సెల్ఫోన్ తీసి వీడియో తీయడం తప్పా సహాయం చేయడానికి మాత్రం ముందడుగు వేయడం లేదు ఎవరు. ఇలా ప్రాణాలు కాపాడటం చేయకపోగా ఇక చిన్న చిన్న కారణాలకే మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న సంఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని  చెప్పాలి.



 ఇక ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోయి ఉన్మాదులు గా మారిపోతున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి. సాధారణంగా రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎవరైనా అడ్డొస్తే హరన్ కొడతాం.. ఎంతకీ అతను పక్కకు జరగకపోతే.. కాస్త సైడ్ తీసుకొని ముందుకు వెళుతూ చెవులు వినిపించడం లేదా అంతలా హారన్ కొడుతుంటే అంటూ ఒక మాట అనేసి వెళుతూ ఉంటాము. కానీ ఇక్కడ  బాలిక అలా చేయలేదు. రోడ్డుపై హారన్ కొట్టిన పక్కకు జరగలేదు అన్న కారణంతో ఏకంగా అతణ్ణి చంపేసింది.


 ఇంతకీ ఆ బాలిక దాడి చేసి హత్య చేసింది ఎవరినో తెలుసా చెవిటి  వ్యక్తిని. ఈ ఘటన కాస్తా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కకలిపారా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. పదిహేనేళ్ల బాలిక తన స్కూటీ తీసుకుని రోడ్డు పైకి వెళ్ళింది. అదే సమయంలో రోడ్డుపై సైకిల్ నడుచుకుంటూ వెళ్తున్నాడు సుదామా అనే 40 ఏళ్ల వ్యక్తి.  పక్కకు తప్పుకోవాలని హారన్ కొట్టిన అతడు చెవిటి వాడు కావడంతో వినిపించలేదు. దీంతో పక్కకి తప్పుకోలేదు. దీంతో కావాలనే అలా చేస్తున్నాడని కోపంతో ఊగిపోయిన బాలిక తన వద్ద ఉన్న కత్తితో అతని గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. స్థానికుల అతన్ని ఆస్పత్రికి తరలించగా అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: