ఇటీవల మహారాష్ట్ర లోని ముంబై లో కూడా ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యువకుడే చివరికి ఆ అమ్మాయి పై అనుమానం పెంచుకుని ప్రాణాలు తీసేసాడు. ఈ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఇరవై నాలుగేళ్ల అఖిలేష్ ప్యారేలాల్ గౌతమ్, 27 ఏళ్ళ మనిషా జైస్వాల్ ప్రేమించుకున్నారు. కొంతకాలం నుంచి రిలేషన్షిప్ లో కొనసాగుతున్నారు. పెళ్లి చేసుకుని ఎంతో హాయిగా జీవించాలని భావించారు. కానీ అంతలోనే వారి బంధంలోకి అనుమానం పెనుభూతం దూరింది. మనీషా మరో యువకుడుతో సంబంధం పెట్టుకుందని అతను అనుమానించడం మొదలుపెట్టాడు.
ఇక చిన్నగా మొదలైన అనుమానం క్రమక్రమంగా పెరిగి పెద్దదయింది. ఇటీవలే అఖిలేష్ మనీషా జైశ్వాల్ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. క్రమంగా వీరి మధ్య గొడవ జరిగింది. గొడవ మాటల నుంచి చేతల వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే అఖిలేష్ దారుణంగా ప్రియురాలి గొంతు కోశాడు. కుటుంబ సభ్యులు యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.