
అలా అనుకున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విమానం 6 గంటలు లేట్ కావడానికి కారణం ఒక సీట్లు ఉన్న వ్యక్తి పక్క సీట్లో ఉన్న వ్యక్తి మొబైల్ లో చాటింగ్ చూసినందుకు. షాక్ అవుతున్నారు కదా. ఇది నిజంగానే జరిగింది. కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. విమానం మంగళూరు నుంచి ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.. ఇక ప్రయాణికులందరూ కూడా విమానంలో ఎక్కారు. సీట్ బెల్టులు బిగించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ఒక అమ్మాయి తో చాటింగ్ చేస్తున్న సమయంలో అతని పక్కనే కూర్చున్న మరో వ్యక్తి ఆ చాటింగ్ ని చూడటం మొదలుపెట్టాడు.
అయితే ఇలా సదరు వ్యక్తి అమ్మాయితో చేస్తున్న చాటింగ్ కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. ఈ క్రమంలోనే వెంటనే భద్రతా సిబ్బందికి ఈ విషయం చెప్పాడు. అయితే వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు అందర్నీ కూడా ఖాళీ చేయించారు. అనంతరం విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అని చెప్పాలి. అయితే అమ్మాయితో చాటింగ్ చేస్తున్న సమయంలో అందులో యు ఆర్ ద బాంబర్ అనే ఒక మెసేజ్ చూసి హడలిపోయాడూ. ఈ ఒక్క ఒక్క మెసేజ్ ఊహించని తంటాలు తీసుకువచ్చింది. విమాన సిబ్బంది ఇలా అమ్మాయితో చాటింగ్ చేసిన ప్రయాణికుడిని ప్రశ్నించగా. తాము మంచి స్నేహితులమని.. మా మధ్య సరదా కోసమే అలా చాటింగ్ చేసుకున్నాము అంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.